జనగామ – రఘునాథపల్లి మండలం సోమయ్యకుంట తండాకు చెందిన కేతావత్ సంతోష్(36), సరోజ దంపతులు.. అప్పుల బాధతో దంపతులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందగా, భార్య చికిత్స పొందుతున్నది.
జనగామ – చిల్పూర్ మండలం కొండాపూర్‌కు చెందిన మహిళ రైతు వెంకటలక్ష్మి కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని రెవెన్యూ అధికారులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆత్మహత్య చేసుకున్నది.
వరంగల్ – వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బెటి తండాకి చెందిన బానోత్ రాంధాన్, కమలమ్మ దంపతులు 9 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశారు. రెండుసార్లు పత్తి గింజలు వేసినా మొలకెత్తలేదు.
దీంతో అప్పులు మీదపడగా, మరోవైపు కుటుంబ పోషణ భారంగా మారడంతో కమలమ్మ తీవ్ర మనోవేద నకు గురైయ్యి.. పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది.