ఒకే చోట,ఒకే ధాన్యం తేమశాతం తెలిపే మిషన్లో వేరు వేరు శాతం చూపిస్తున్న వైనం
వరి కోతలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్న సమయంలో బోర్లం గ్రామ సొసైటీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది తేమ శాతం నిర్ధారించే మీటర్లను వాడడంలో నిర్లక్ష్యం వహించి రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఎప్పుడో తెచ్చిన మిషన్లను వాడుతూ రైతు కంట కన్నీరు కారణమవుతున్నారు అధికారులు ముందే సిద్ధం కావాల్సిన తరుణంలో నిర్లక్ష్యం వహించి తేమశాతం నిర్ధారించే మిషిన్లు ఇప్పుడు తెప్పిస్తున్నామంటూ సమాధానం ఇస్తే ఎలా అని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందే కష్టాల ఊబిలో కురుకపోయిన అన్నదాతను బయటకు లాగి,
అన్నదాతకు అండగా నిలవాల్సిన మార్కెట్ కమిటీ లు ధాన్యం తేమశాతం చూపించే యంత్రాలు అన్నదాతలను గోల్మాల్ చేస్తున్నాయి.
ఒకవైపు అరగాలం శ్రమించి పండించిన పంట, అకాల వర్షాల వల్ల దెబ్బతిని ఉన్న నాలుగు గింజలైన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అమ్ముకొని గిట్టుబాటు ధర పొందుదామని ఆశించిన రైతులకు ,మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ధాన్యం తేమశాతం చూపే యంత్రామాయచేస్తున్నాయి..
ఒకవైపు తరుగు తీయకూడదు అంటూ అధికారులు ఆదేశించినప్పటికీ, తరుగు మాత్రం తీస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉంటే కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం శివారులో సాయి రెడ్డి అనే రైతు తన ధాన్యం బోర్లం మార్కెట్ కమిటీకి అమ్మడానికి సిద్ధం కాక, ధాన్యం తేమశాతం చూడడానికి సంబంధిత శాఖ అధికారులు సోమవారం వచ్చారు.
వారి వద్ద రెండు తేమశాతం యంత్రాలు ఉన్నాయి. ఒకే చోట ఒకే ధాన్యం తీసుకొని రెండు తేమశాతం యంత్రాల్లో వేసి తేమశాతం చూడగా ఒక యంత్రంలో 17.7 శాతం తేమ ఉన్నట్లు చూపెడుతుండగా, మరొకటి 20.4 శాతం తేమ ఉన్నట్లు చూపడం పట్ల అన్నదాతలు తేమశాతం మిషన్ల పనితీరుపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే చోట ఉన్న ధాన్యం ఒక యంత్రం ఒక విధంగా తేమ శాతం చూపిస్తుండగా, మరొకటి ఎక్కువగా తేమ శాతం ఉన్నట్లు చూపడం వెనుక అంతర్యం ఏమిటని అధికారులు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒకే చోట అధికారులు తీసిన ధాన్యం ఒక్కొక్క యంత్రంలో ఒక్కొక్క రకంగా తేమశాతం చూపడం వల్ల రైతులు మండిపడుతున్నారు.
తేమశాతం యంత్రాల పనితీరు ఇలా ఉంటే, కొలతల మిషన్ పరిస్థితి ఏ విధంగా ఉందో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
