సమాజంలో, వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటూ కలలు కనడం కన్న ప్రత్యక్ష ప్రయత్నం చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డీఎస్పీ గంగాధర్ పేర్కొన్నారు.మంగళవారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని నందిపేట్ ప్రాంతానికి చెందిన గంగాధర్ డిఎస్పీ తన ఉద్యోగానికి రాజీనామా చేసి త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధం అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాను మొదటి ప్రయత్నంలోనే 1998 బ్యాచ్ లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.ఎస్ఐ గా నల్గొండ జిల్లాలో పనిచేస్తుండగానే 2010 లో సీఐ గా పదోన్నతి పొందినట్లు తెలిపారు.
అలాగే ఈ 26 సంవత్సరాల సర్వీసులో ఏనాడు ఎవరిపట్ల ఎలాంటి పక్షపాతం చూపలేదు. అణచివేతలు చేయలేదు. నా కర్తవ్యలను పూర్తి నిబద్ధతతో, అంకితభావంతో ఎంతో ఉత్సాహంతో నిర్వహించాననీ పేర్కొన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు యువ న్యాయకత్వం “యువత” రాజకీయ ప్రవేశం అనివార్యతను సూచిస్తుందని తెలిపారు. కనుక నేను రాజకీయాలలో ఆదర్శవంతమైన న్యాయకత్వాన్ని అందించుటకు ఆ దిశగా యువతను ప్రోత్సహించుటకు ఆసన్నమైందిగా భావిస్తున్నాను.
నేనొక పోలీస్ అధికారిగా 26 సంవత్సరాల పాటు కలిగిన అనుభవం, వృత్తి నైపుణ్యం, లోతైన విశ్లేషణతో ప్రజా సమస్యల పరిష్కారం లాంటి గుణాలతో ప్రభుత్వానికి, ప్రజలకు అవసరమైనపుడల్ల ఉపయోగించుటకు కృతనిశ్చయంతో ఉన్నానని తెలిపారు.
ప్రస్తుతం నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.
