నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దశాబ్దాల కాలంగా వస్తున్న ఊరిపండగ ఆదివారం ఘనంగా నిర్వహించారు.
కొత్త దేవత మూర్తులను ఖిల్లాలోనే ప్రతిష్టించి
ఊర పండుగ నిర్వహణ కమిటీ అయిన సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న తేలుమైసమ్మ గద్దె వద్ద గ్రామ దేవతలను పసుపు, కుంకుమ, ఆభరణాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
మామిడి కర్రలతో తయారు చేసిన 12 దేవత విగ్రహాలను అర్ధరాత్రే వాటిని ఖిల్లా వద్ద ప్రతిష్టించరు.మూడురోజుల ముందే ఆనవాయితీ ప్రకారం బాసర గోదావరి నుంచి పవిత్ర జలాలు తెచ్చి ఖిల్లా వద్ద గ్రామదేవతలు జలాభిషేకం చేయడంతోనే ఊర పండగ ఉత్సవాలు మొదలయ్యాయి.
ఈసారి ఊరపండగ సంబరాలు నగరం నాలుగు వైపులా అంబరాన్ని తాకుతాయి.ఖిల్లా రఘునాథ ఆలయం దగ్గర నుంచి దేవత మూర్తిలను ఊరేగింపుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లే ఘట్టంకు భారీఎత్తున భక్తులు తరలివచ్చారు.
కొత్త దేవత మూర్తులను నగరంలోని ఆయా ప్రాంతాల్లోని ఆలయాలకు తరలించారు. దేవత మూర్తుల ఊరేగింపుకు ఎదురెళ్లి కోళ్లను ఎగరేశారు. ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో రోడ్ల మీదే మేకలు..
గోర్లను బలి ఇచ్చారు. ఈ సారి వర్షాలు పుష్కలంగా పడాలని ఎలాంటి అరిష్టాలు అనారో గ్యాలు రాకుండా ఉండాలని అందుకు 12 గ్రామదేవతలకు ఓకె రోజు పూజలు చేయడం జిల్లాకేంద్రంలో దశాబ్దాల తరబడిగా వస్తుంది.
ఈ ఊర పండగ సందర్భంగా నగరంలోనీ పలువురు నాయకులు, నేతలు భారీఎత్తున వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
దర్శనం కోసం వచ్చిన అర్ధన్ ఎమ్మెల్యే కన్పాల్ సూర్యనారాయ, ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ మొదటి సారిగా రావడంతో ఆయనకు నిర్వాహకులు స్వాగతం పలికి సత్కరించారు.
కాంగ్రెస్ నాయకులు కేశవేణు,నరాల రత్నాకర్ లతో పాటు ఆయా పార్టీలకు చెందిన నేతలు దర్శించుకున్నారు.
ఖిల్లా నుంచి దేవత మూర్తుల ఊరేగింపు.
కొత్త దేవత మూర్తులను ఖిల్లాలోనే ప్రతిష్టించారు. ఊర పండుగ నిర్వహణ కమిటీ అయిన సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న తేలుమైసమ్మ గద్దె వద్ద గ్రామ దేవతలను పసుపు, కుంకుమ, ఆభరణాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దేవతామూర్తుల ఊరేగింపు ప్రారంభించారు. ఈ ఊరేగింపులో తొట్టేల కింద భారీ భక్త జనం లైన్ లో కూర్చున్నారు. వీరి మీద నుంచి తొట్టెలు తీసుకెళ్లడం సాంప్రదాయంగా వస్తుంది.
డప్పులు, పోతరాజుల విన్యాసాలు,శివసత్తుల, మహిళల పూనకాలతో దేవతామూర్తుల ఊరేగింపు ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న శారదాంబ గద్దె (తేలుమైసమ్మ గద్దె) నుంచి మొదలై గాజుల్‌పేట్ చౌరస్తా మీదుగా పెద్దబజార్ చౌరస్తా వరకు చేరుకుంటాయి.
ఇక్కడి నుంచి రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం పౌడాలమ్మ, నల్లపోచమ్మ, అడెల్లి పోచమ్మ, పెద్దమ్మ, పులి, రాట్నం, ఆసు, తొట్లెలతో ఊరేగింపు దుబ్బవైపు వెళ్తుంది.
రెండో బృందం సిర్నాపల్లిగడి, గోల్ హనుమాన్ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్ ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహా లక్ష్మమ్మలతో వెళ్తుంది.
సరిని నాలుగు గుల్లలుగా విభజిస్తారు. ఒక గుల్ల దుబ్బవైపు, రెండవది వినాయక్‌నగర్, మూడోది ఎల్లమ్మగుట్ట, నాల్గోది కంఠేశ్వర్ ప్రాంతాలకు చల్లుకుంటూ వెళ్తారు.
