డిచ్పల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుండి గురుగ్రామ్ వెళ్లుతున్న కంటైనర్ లారీ డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపక్కన ఆపి పరిశీలిస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కంటైనర్ లారీ అదుపు తప్పి ఢీకొట్టింది.
ఈ ప్రమాద సమయంలో లారీలో ఉన్న క్లీనర్ కంటైనర్ పై నుంచి కిందకు పడిపోగా, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కంటైనర్ చక్రాలు అతనిపై నుంచి పోయి నలిగి అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లీనర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
