HomeEditorial Specialనగర సారథ్యం ఫై యువ నేతల ఆసక్తి .... కాంగ్రెస్ సంస్థాగత పదవుల పందేరం ......రేసులో...

నగర సారథ్యం ఫై యువ నేతల ఆసక్తి …. కాంగ్రెస్ సంస్థాగత పదవుల పందేరం ……రేసులో పంచరెడ్డి చరణ్ ,బొబ్బిలి రామకృష్ణ. గడుగు రోహిత్

స్థానిక సంస్థల ఎన్నికలో సానుకూల ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగత గత ప్రక్షాళనకు సిద్ధం అయింది. నామినేటెడ్ పదవుల తో పాటు పార్టీ లోనూ పదవుల పందేరం కు తెరలేపింది.

ఈ మేరకు జిల్లాకు ఇంచార్జ్ లను రంగంలోకి దింపింది. ఎమ్మెల్సీ బలమూరు, వెంకట్.రాజారెడ్డి అహ్మద్ లకు జిల్లా బాధ్యతలు అప్పగించారు. వారు గత మూడు రోజులుగా ఇక్కడే మకాం వేసి ఇదే పనిలో ఉన్నారు.

పార్టీ ని బలోపేతం చేసే ఔత్సహికుల వేటలో వినూత్న పంథా ను అనుసరిస్తుంది.పార్టీ పదవులు ఆశిస్తున్నా నేతలతో ముఖాముఖీ అవుతుంది.

పార్టీకి చెందిన ముఖ్య నేతలను పిలిచి వారు రాబోయే రోజుల్లో ఎలాంటి పదవులు కోరుకుంటున్నారనేది వాకబు చేస్తున్నారు.ప్రధానంగా పార్టీ పదవులకు ఎవరెవరు ఆసక్తిగా ఉన్నారనేది అరా తీస్తున్నారు.

ముఖ్యంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఇంచార్జ్ లు ఎడతెగని కసరత్తులు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అర్బన్ కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కోసం పోటీ నెలకొంది.

దాదాపు దశాబ్ద కాలంగా నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కేశ వేణు కొనసాగుతున్నారు. గతంలో యువజన కాంగ్రెస్ లో పనిచేసిన వేణు నూడా ఛైర్మెన్ గా నియామకం అయ్యారు.

దాదాపు యేడాది కాలంగా ఆయన జోడు పదవుల మీద స్వారీ చేస్తున్నారు. పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన ఈపాటికే స్పష్టం చేసారు.

ఎలాగో నామినేటెడ్ పదవులు భర్తీ పక్రియ పూర్తీ అయింది.కనీస పార్టీ పదవులైన దక్కించుకోవాలనే ఆలోచనలో నేతలు పార్టీ పదవులకు క్యూ కట్టారు.

కానీ ఈసారి అనూహ్యంగా యువనేతలే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు విద్యార్థి యువజన విభాగాల్లో పనిచేసిన వారే నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ముందున్నారు.

అరడజన్ మంది ఈ పదవి తమకు ఇవ్వాలని ఇంచార్జ్ లను అడిగారు. నలుగురు యువనేతలు మాత్రం సీరియస్ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

బొబ్బిలి రామకృష్ణ, పంచరెడ్డి చరణ్ , గడుగు రోహిత్ లు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. అర్బన్ సెగ్మెంట్ లో ముగ్గురు నేతలు పెత్తనం సాగుతున్న నేపథ్యంలో ఈ పదవీ నియామకంలో ఎవరికి మాట చెల్లు బాటు అవుతుందోననేది ఆసక్తిగా మారింది.

పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తన సొంత సెగ్మెంట్ గా భావిస్తున్న అర్బన్ అధ్యక్ష పదవి తన విధేయుడి ఇవ్వాలనే పట్టుదల తో ఉన్నారు.

అర్బన్ ఇంచార్జ్ గా ఉన్న షబ్బీర్ అలీ తో పాటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లు సైతం అర్బాన్ పార్టీ వ్యవహారాల్లో ఆధిపత్యం సాగిస్తున్నారు.

కీలకమైన అర్బన్ అధ్యక్ష పదవి కోసం వారు తెరవెనుక పావులు కదిపే అవకాశం ఉంది. కానీ మహేష్ గౌడ్ ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేలా లేరు.

అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడి గా మున్నారు కాపు సామజిక వర్గం చెందిన వారే ఉండాలని మహేష్ చెప్తున్నారు అందుకే ఆయన బొబ్బిలి రామకృష్ణ విషయంలో కొంత సానుకూలంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

కానీ అదే సామాజిక వర్గం కు చెందిన పంచరెడ్డి చరణ్ సైతం మహేష్ తో షబ్బీర్ అలీ ల మీద ఒత్తిడి చేస్తున్నారు.మరో వైపు తనయుడి కోసం గడుగు గంగాధర్ సైతం మహేష్ మీద ఒత్తిడి చేస్తూ వస్తున్నారు.

కార్పొరేటర్ గా గత ఐదేళ్లు అనేక ప్రజఆందోళనలు చేసిన రోహిత్ గత ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారనే విషయాన్ని గడుగు పార్టీ పెద్దల ముందు ప్రస్తావిస్తున్నారు. అర్బాన్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం అగ్ర నేతలు తెరవెనుక ఎడతెగని కసరత్తులే చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments