తమ సంఘ భవనం లో ఉన్న పోలీస్ స్టేషన్ ను వెంటనే ఖాళీ చెయ్యాలంటూ ముప్కాల్ మండల గంగాపుత్రులు మూకుమ్మడిగా సోమవారం నిజామాబాద్ వచ్చి ప్రజావాణి లో ఉన్న కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు
ముప్కాల్ మండలం ఏర్పాటు అయ్యాక తాత్కాలిక అవసరాల కోసం తమ సంఘంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఇచ్చామని అప్పటినుంచి ఇప్పటివరకు ఖాళీ చేయడం లేదని గంగపుత్రుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు నూతనంగా పోలీస్ స్టేషన్ కొరకు ఒక సంవత్సరం పాటు అద్దెకు కోసం ఇచ్చామన్నారు.
కానీ ఎనిమిది ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఖాళీ చేయడం లేదని వారు వాపోయారు. అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో తమ గంగపుత్ర సంఘం ను పోలీస్ స్టేషన్ కోసం అద్దెకు ఇవ్వాలని ముప్కాల్ లోని అన్ని కులాల సంఘాలు తమ మీద ఒత్తిడి తెచ్చాయన్నారు.
అందుకే అద్దెకు ఇవ్వడం జరిగిందన్నారు సంఘ భవనం పోలీస్ స్టేషన్ కొరకు ఇవ్వడంతో తమకు ఎలాంటి సంఘ భవనం అందుబాటులో లేకపోవడంతో మా సంఘం ముఖ్య కార్యక్రమాలు సమావేశాలు శుభ, అశుభ, కార్యక్రమాలు మరియు మత్స్యకారుల సొసైటీ అభివృద్ధి గురించి మాట్లాడుకునేందుకు ఆరుబయట నిర్వహించుకోవాల్సి వస్తుందన్నారు పోలీస్ సూచన మేరకు స్టేషన్ కోసం మరో చూపించమని .
ఆర్యవైశ్య సంఘం సభ్యుని భవనం చూపించడం జరిగింది. దానికి కావాల్సిన మరమ్మతులు ఖర్చు కొరకు అన్ని సంఘాల సభ్యులు రూ 1,92,లక్షలు జమ చేసి రెండు సంవత్సరముల కిరాయి కట్టడం జరిగిందన్నారు కానీ పోలీసులు స్టేషన్ ను ఆ సంఘం ఖాళీ చేసి కొత్త భవనం లోకి రావడానికి నిరాకరిస్తున్నారు.
ఈ విషయము మీరు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నాము కావున మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని ముప్కాల్ గంగపుత్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఈ వినతి పత్రాన్ని ప్రజావాణిలో కలెక్టర్ అందజేశారు
