బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీష్ రావు పశుపతిలా ప్రవర్తిస్తున్నారని క్షుద్ర పూజలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారుఆయన మంగళవారం గాంధీ భవన్ లో మీడియా తో మాట్లాడారు.
రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని కరువు రావాలని కుట్రలు కుతంత్రాలు చేశారన్నారు. హరీష్ రావు క్షుద్రపూజలు చేశాడనేందుకు ఆధారాలు ఉన్నాయన్నారు .తమిళనాడులోని తిరుచిరాపల్లి, శివమొగ్గ ప్రాంతాల్లో క్షుద్రపూజలు చేసే దేవాలయాలున్నాయని, అక్కడికి హరీష్ రావు జూన్ 1, మే 31, జులై 23న వెళ్లారనేందుకు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.
అబద్ధమైతే తాము చెప్పిన తేదీల్లో హరీష్ రావు ఎక్కడున్నారో మీడియాకు చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ సమాధానం చెప్తే.. తాను, సీఎం కూడా బీఆర్ఎస్ అడిగేవాటికి సమాధానం చెప్తామన్నారు.
వాస్తవాలు మాట్లాడినందుకు తమ పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చినంత ఈజీగా నిజాలు చెప్పలేరన్నారు. శివమొగ్గ వెళ్లిన హరీష్ రావు ఫొటోలను సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
తిరుపతి వెళ్తే మీడియాతో మాట్లాడే హరీష్ రావు.. శివ మొగ్గు టూర్ ను గోప్యంగా పెట్టారని మహేష్ ప్రశ్నించారు . రాష్ట్రానికి మంచి జరగకూడదని క్షుద్రపూజలు చేయడం సిగ్గుచేటన్నారు
