తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026–-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్లలో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
NEET UG-–2026లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఆగస్టు 5 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు https://tsmedadm.tsche.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది.
