HomeTelanganaNizamabadకాపుల్లో ఆయనే పెద్దకాపు ……కాపులను ఒక్క తాటి మీదికి తెచ్చి …ఆర్థికంగా పటిష్టం చేసిన ఘనత...

కాపుల్లో ఆయనే పెద్దకాపు ……కాపులను ఒక్క తాటి మీదికి తెచ్చి …ఆర్థికంగా పటిష్టం చేసిన ఘనత డీఎస్ దే

చెట్టుకొకరు …పుట్టకొకరు అనే చందంగా ఉన్న కాపులను ఒక్క తాటి మీది కి తెచ్చి అందరిని ఒకే వేదిక మీదికి తెచ్చిన ఖ్యాతి డీఎస్ దే . వేల్పూర్ కు చెందిన ఆయన హైదారాబాద్ లో విద్యాబ్యాసం చేసారు.

విద్యార్ధి దశలోనే పార్టీ లో కి వచ్చిన ఆయన ఆర్మూర్ బాల్కొండ లో అప్పటికే దిగ్గజ నేతలుండడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి అడ్డా గా చేసుకున్నారు. మున్నూరు కాపులు ఎక్కువగా ఉన్న ఇక్కడ రాజకీయంగా నిలదొక్కుకోవడం సులువు అనుకున్నారు.

కానీ అనతి కాలం లో నే పార్టీలో ఢిల్లీ స్థాయిలో పట్టు సాధించిన డీఎస్ కు నిజామాబాద్ లో అందులోనూ మున్నారుకాపుల్లో అంత సులువుగా పట్టు దొరకలేదు. స్థానిక కాపులు ఆయన్ని చాల కాలం స్థానికేతరుడిగానే చూసారు.

ప్రజా జీవితం లో ఉన్నాసరే పార్టీలో దిగ్గజ నేతగా ఎదుగుతున్న ఆయన తన సొంత సామాజిక వర్గం పక్షపాతి అనే ముద్ర పడకుండా మున్నారుకాపు సంఘాలను ఒక్క తాటి మీదికి తేవడానికి వ్యూహాత్మకంగా పావులు కదిపారు.

ఆయన రాజకీయాల్లో ఎంట్రీ అయిన రోజుల్లో నగరం ఒకరిద్దరే మున్నారుకాపు పెద్దలుగా చెలామణి అవుతున్న సరే సంఘాలనిర్మణం లేకుండే. నగరంలో ఆయా ప్రాంతాలల్లో ఉన్న కాపులను ఒకే వేదిక మీదికి తేవడానికి డీఎస్ కు దశాబ్ద కాలమే పట్టింది.

ఎనిమిది సంఘాలను ఒక్కతాటి మీదికి తెచ్చి నగర మున్నారుకాపు సంఘం కు బీజం వేశారు. కల్లు డిపో ల నుంచి వచ్చే విరాళాలతో ప్రగతి నగర్ లో స్థలం సేకరించి ఎంపీ ఎమ్మెల్యే ల ఫండ్ లతో కల్యాణ మండపం నిర్మించారు.

తన సామజిక వర్గంలో పేదలు ఆర్థిక భారం పడకుండా శుభకార్యాలు చేసుకునే వీలు కల్పించారు. నగరంలో ఆయా ప్రాంతాల్లోనూ సంఘాలను సైతం ఆర్థికంగా పటిష్టం అయ్యేలా చేసారు. నిజానికి నగరంలో కాపులు అంత కలిసి కట్టుగా ఉండడానికి ఈ కల్యాణ మండపం బలమైన వేదికగా మారింది.

ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ గా పనిచేసిన తాను కాపులకు ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం జరిగిన డీఎస్ పట్టించుకోలేదు. అందుకే నాలుగు దశాబ్దాలుగా కాపులు డీఎస్ నే తమ పెద్దకాపుగా కొలుస్తూ వస్తున్నారు.

ఎన్నికల్లో ఓడిన గెలిచినా సామాజికవర్గం ను అండగానే వుంటూ వచ్చారు.కాపుల్లో ఆయన ఆధిపత్యం నిలువరించే ఎత్తుగడల్లో భాగంగా కాపు సంఘం ను నిలువునా చీల్చే యత్నాలు సైతం అనేక సార్లు బెడిసి కొట్టాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments