తెలంగాణలో పలు ప్రాంతాలు భారీ వర్షాలు అతుల కుతులం చేస్తున్నాయి. పలు ప్రాంతాల కు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. కామారెడ్డి జిల్లాలోజోరు వర్షం పడుతుంది శనివారం రాత్రి నుంచి క్యూములోనింబస్ మేఘాలు కమ్మెశాయి.
దీంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే వాతావరణం చల్లగా మారిపోయింది. దీనికి తోడు కర్ణాటక మీదరుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటడంతో పలు వికారాబాద్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
క్యూములోనింబస్ మేఘాలు రాష్ట్రం మొత్తం వ్యాపించి ఉండటంతో పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తుంది. దీంతో ఈ రోజు రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని..
వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉన్నట్లుండి కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
