పదకొండు రోజుల పాటు విశేష పూజలు అందుకున్న మహిషాసుర మర్దిని అమ్మవారికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. డప్పు చప్పుళ్ల హిళారు కోలాటలతో, కేరింతలతో యువత నగరంలో కోలాహలంగా జరిగింది. దేవీ శరన్నది రాత్రి ఉత్స వాలు ముగియడంతో అమ్మవార్ల ప్రతిమలను భక్తులు నిమజ్జనానికి తరలించారు.
సెప్టెంబర్ 22 తేదీ నుంచి అంగరంగ వైభవంగా పూజలందుకున్న దేవీమాత శనివారం నిమజ్జనానికి తరలివెళ్లాయి. అమ్మవారు రోజుకొక రూపంలో భక్తుల పూజలు అందుకుంది.
భక్తులు కుంకుమ పూజలు, అర్జనలు, గోపులు, అక్షరాభ్యాసాలు, పాఠామాలు, అన్నదానములు నిర్వహించారు. ఈ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా దేవి మండలి నిర్వహకులు ఘనంగా పల్లకి సేవను నిర్వహించడం ప్రత్యేకత చాటుకుంది.
రకరకాల ప్రసాదాలను నైవేద్యం సమర్పించుకున్నారు. దేవమాత శోభయాత్ర జరిగి దారిపొడవున భక్తులు మంగళహారతులను, కొబ్బరి కాయలను, నైవేద్యాలను సమర్పించుకున్నారు.
అమ్మవారి ముందు భవాని భక్తులు, సాధరణ భక్తులు నృత్యాలు చేస్తూ తన్మయత్వం చెందారు. బాణ సంచాలను కళాతు, కాశాయ జెండాలను పట్టుకొని ర్యాలీగా అమ్మవారికి వీడ్కోలు పలికారు.
శోభాయాత్రలో మహిళలు, యువతులు, చిన్నారులు ఆడిన దాండియా ఆటలు, కోలాట నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం దుర్గామాత విగ్రహాలను బాసర గోదావరిలో నిమజ్జనం చేశారు.
ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
