కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం నిజామాబాద్ నగరానికి చేరుకున్నారు. ఆయన బేగంపేట్ నుంచి హెలి క్యాపిటర్ లో కొత్తకలెక్టరేట్ ప్రాంగణంలో దిగారు.
ఆయన కు ఎంపీ అర్వింద్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ లతో పటు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా పసుపు బోర్డు కొత్త కార్యాలయానికి చేరుకున్నారు.
బోర్డు తాత్కాలిక కార్యాలయంను ప్రారంభించిన అనంతరం బస్వా గార్డెన్ లో పసుపు రైతులతో భేటీ అయ్యారు.రాష్ట్ర మంత్రులు సీతక్క తో పాటు తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ లు పాల్గొన్నారు అక్కడి నుంచి బైపాస్ చౌరస్తా లో డీఎస్ కాస్య విగ్రహం ను ప్రారంభించారు.
