జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. గత మూడు రోజులుగా ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు.
అయితే నిన్న, మొన్నటి వరకు వానల కోసం ఎదురుచూసిన రైతులు రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం క్రమంగా భారీగా మారింది.
దీంతో నగరం దాదాపు జలమయం అయింది. దీంతో భారీగా వరద నీరు చేరి రోడ్లు చెరువులను తలపించాయి. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
అలాగే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి నేటి ఉదయం వరకు 1069.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అత్య ధికంగా చందూరు 57.3, కోటగిరి 56.8, రుద్రూర్ 54.6, పోతంగల్ 52.5 మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదైందన్నారు.
అత్యల్పంగా ముప్కాల్ 10.5, కమ్మర్పల్లి 12.9, ఏర్గట్ల 13.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించారు.కాగా ఈ రోజు కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అవసరం ఉంటేనే బయటకు రావాలని వాతావరణ అధికారులు సూచించారు.
