HomePOLITICAL NEWSNationalపాక్ లో ఉగ్ర స్థావరాల మీద విరుచుక పడ్డ భారత్

పాక్ లో ఉగ్ర స్థావరాల మీద విరుచుక పడ్డ భారత్

భారత్ ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది పహాల్గమ్ హత్య కాండ కు గట్టిగా బదులు ఇచ్చింది.ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో భారత్ మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జామున నాలుగు గంటల దాక ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం వైమానిక దాడులు చేసింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తోపాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది.

మొత్తం 9 ఉగ్ర స్థావరాలను, వారి సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసినట్లు తెలిసింది. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు జరపడం విశేషం. భారత సైన్యం దాడులను పాకిస్థాన్‌ సైన్యం నిర్ధారించింది.

భారత్‌ దాడి చేసిందని ప్రకటించింది. కోట్లి, ముజఫరాబాద్‌, బహవల్‌పూర్‌లపై మిసైల్స్‌తో దాడులు చేసినట్లు పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి తెలిపారు.

ఆపరేషన్‌ సింధూర్‌..

ఈ పేరు పెట్టడానికి అసలు కారణం పహల్గామ్ ఉగ్రదాడి. ఏప్రిల్‌ 22న పహల్గాంలోని బైసరన్‌ లోయలో మొత్తం 28 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి దారుణంగా మతం అడిగి మరీ కాల్చి చంపారు.

ఈ ఉగ్రవాద దాడిలో 26 ఏళ్ల ఓ నేవీ అధికారి వినయ్‌ మరణించాడు. అతడిని పెళ్లి జరిగిన కేవలం ఐదు రోజులకే టెర్రరిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు. భర్త వినయ్ మృతదేహం వద్ద గుండెలవిసేలా భార్య హిమాన్షి ఏడుస్తున్న ఫొటో దేశం మొత్తాన్ని కదిపేసింది.

ఈ ఉగ్రదాడిలో హిమాన్షితో పాటు చాలా మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగానే భారత్ ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరుతో పాకిస్తాన్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడి వెనుక జైష్ మహ్మద్ లాష్క్ కారే తోయిబా లాంటి ఉగ్ర సంస్థ లున్నాయని నిరాదరించుకున్నాకే భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది.

భారతదేశం లక్ష్యంగా చేసుకున్న తొమ్మిది ప్రదేశాలు బహవల్‌పూర్‌లోని జెఎం ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) రెండూ పాకిస్తాన్ పంజాబ్‌లోనివే. ఆదేశ ప్రజలు కానీ సైనికుల లకు ఎలాంటి నష్ట కల్గకుండా ఆపరేషన్ సింద్ నిర్వహించారు.

అయితే ఈ దాడుల్లో ఆయా ఉగ్ర స్థావరాల్లో ఎంత మంది హతం అయ్యారనేది ఆర్మీ ఇంకా ఖరారు చెయ్యలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments