నగరంలో మరో గంజాయి స్మగ్లర్ ను సీసీ యస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాబన్ సబ్ పహాడ్ ప్రాంతానికి చెందిన అఫ్రోజ్ గత కొంత కాలంగా నగరంలో గంజాయి దందా సాగిస్తున్నట్లు అనిమానిస్తున్న సీసీఎస్ పోలీసులు గత కొద్దీ రోజులుగా గాలిస్తున్నారు.
గతంలో అనేక కేసులో ఉన్న అఫ్రోజ్ ను ఎట్టకేలకు చిక్కడం తో ఈ ముఠా వెనుక ఎవరెవరున్నారనేది విచారిస్తున్నారు. ఇప్పటికే తనకు గంజాయి దందా లో సహకరిస్తున్న ఒకరిద్దరి పేర్ల ను అఫ్రోజ్ వెల్లడించారని సమాచారం.ఈసారి అఫ్రోజ్ బ్యాచ్ మీద ఉక్కుపాదం మోపడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు
