HomeTelanganaNizamabadగద్దర్ ను అవమానించిందని కాంగ్రెస్ పార్టీ కదా?

గద్దర్ ను అవమానించిందని కాంగ్రెస్ పార్టీ కదా?

ఇందిరమ్మ ఇళ్లకు గద్దర్ ఇళ్లు అని పేరు పెట్టి ఇంటికో తుపాకీ ఇవ్వండి..

సీఎంకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మొదట జిల్లాల పేర్లు మార్చండి..

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేష్ హితవు..

ప్రజా గాయకుడు గద్దర్ ను జీవితాంతం అవమానించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేష్ అని ప్రశ్నించారు. గద్దర్ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పింది ఎవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

శనివారం జిల్లా బిజెపి అధ్యక్షుడు పదవికి నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శుక్రవారం రవీంద్ర భారతిలో గద్దర్ 77వ జయంతి సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఆఫీస్‌ ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.గద్దర్ పై,రాజద్రోహం కేసు, ఉపా కేసు ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పార్టీనే కదా.

గద్దర్ పై 21 కేసులు పెట్టింది ఎవరు?. గద్దర్ ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ అర్బన్ నక్సలైట్ ల పై ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందని ఎద్దేవ చేశారు.

గద్దర్ పై అంత ప్రేమ ఉంటే సిఎం ఆఫీస్ కు, గాంధీ భవన్ కు ఆ పేరు పెట్టాలని సూచించారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇస్తా అన్న ఇందిరమ్మ ఇళ్లకు గద్దర్ ఇళ్లు అని పేరు పెట్టి ఇంటికో తుపాకీ ఇవ్వండనీ ద్యజమేతారు. సీఎంకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మొదట హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా, నిజామాబాద్ పేరును ఇందూరుగా, మీ సొంత జిల్లా పేరుని పాలమూరుగా మార్చాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఒక్కరే కాదు 7 సంవత్సరాల వయస్సు గల పిల్లాడి నుంచి పండు ముసలి ముతకా కూడా ఉద్యమం చేశారని గుర్తు చేశారు.

ఉద్యమకారుల కుటుంబాలకు పెన్షన్,ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. అవార్డులు ఎవరికి ఇవ్వాలో అవార్డుల కమిటీ నిర్ణయం చేస్తుందని చెప్పారు.

కిన్నెర ముగులయ్యకు,వన రమ్మయ లాంటి చిన్న చిన్న కళాకారులకి వెతికి అవార్డులు ఇస్తుందని పేర్కొన్నారు.ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల కాలం చెల్లదని,వచ్చేది బిజెపి పార్టీ నే అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 నకిలీ వాగ్దానాలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలి.

తెలంగాణ రాష్ట్రం మీ జాగీరు కాదు మీరిచ్చిన హామీల అమలు చేసేంత వరకు బీజేపీ మిమ్మల్ని వెంటాడుతుంది అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కులాచారీ, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments