ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోతీహార్ జైలు లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈసారి ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం .
శుక్రవారం ఆమె ను హుటాహుటిన ఎయిమ్స్ ఆసుపత్రి కి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమె కు పూర్తీ స్థాయిలో వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆమె ను తిరిగి తీహార్ జైలు కు తరలించారు.
ఆమె దాదాపు 10 కిలోల మేరకు బరువు తగ్గింది. ఆమె పూర్తిగా నిరసించి కనిపించడంతో ఆమె భర్త అనిల్ ఎయిమ్స్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. దాదాపునాలుగు నెలలుగా ఆమె జైలు జీవితం గడుపుతున్నారు ఇటీవలే రెండు పర్యాయాలు జ్వరం బారిన పడడంతో సమీపం లో దీన్దయాల్ దయాల్ ఆసుపత్రిలో చికిత్స చేశారు.
కానీ శుక్రవారం అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స కోసం అనుమతించాలని కవిత న్యాయ వాదీ మోహిత్ రావు కోర్టు లో స్పెషల్ పిటిషన్ వేశారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స కు కోర్టు నిరాకరించింది.
ఎయిమ్స్ లో వైద్య పరీక్షలకు ఆదేశించింది. దీనితో జైలు అధికారులు ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి, వైద్యం చేయించిన అనంతరం తిరిగి జైలుకు తీసుకొచ్చారు.
ఆమె ను పరామర్శించడానికి అన్న కేటీఆర్ బావ హరీష్ రావు సోమవారం జైలు కు వెళ్లనున్నారు.ఈ మేరకు ములాఖత్ కోసం దరకాస్తు చేసుకున్నారు.