HomeTelanganaNizamabadలక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక కళ్యాణలక్ష్మి సాయాన్ని పెంచాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక కళ్యాణలక్ష్మి సాయాన్ని పెంచాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

ఇందూరు నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 326 మంది లబ్దిదారులకు మొత్తం రూ. 3,24,37,584 విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు లబ్దిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మాట్లాడుతూ పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలిచే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వివాహ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పథకాల కింద అందిస్తున్న ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం పెంచాలని కోరారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకం కింద రూ.1 లక్షతో పాటు ఒక తులం బంగారం అందిస్తామని ఇచ్చిన హామీని కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అలా చేస్తే పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు మరింత ఉపశమనం కలుగుతుందని తెలిపారు.ప్రభుత్వం అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ఈ పథకాల ప్రయోజనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు సూచించారు.

ప్రజల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలు నిజమైన లబ్దిదారులకు చేరడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు, నగర మేయర్ కూరగాయల ఉమారాణి గారు, కార్పొరేటర్లు, బట్టు రాఘవేదర్ ,నాగోల్లా లక్ష్మి నారాయణ, బంటు రాము, చింత కాయల రాజేందర్, మమతా, చిరంజీవి, మురళి,న్యాలం రాజు,పరమేష్, గంధం మమత, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్దిదారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments