రేకుల షెడ్డు మీద పడి లైన్ ఇన్స్పెక్టర్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం…
సంజీవ్ రెడ్డి కాలానికి చెందిన శ్రీనివాస్ సోమవారం రాత్రి నగరంలోని అగర్వాల్ కంటి ఆసుపత్రి వెనక ఉన్న కల్లు డిపోకి వెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు రాత్రి గాలివాన బీభత్సంతో చెట్టు కొమ్మ విరిగి కల్లు డిపో రేకులపై పడింది.
దీంతో దాని కూడా శ్రీనివాస్ ఉండడంతో తీవ్ర గాయాలయ్యి అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
