HomeTelanganaNizamabad" పీఎం రాహత్ " పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..

” పీఎం రాహత్ ” పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ” పీఎం రాహత్ ” పథకాన్ని ఇందూరు వాసులు సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఒక ప్రకటన లో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సత్వరమే చికిత్స అందించడమే పథకం ప్రధాన లక్ష్యమన్నారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన వారికి ఏడు రోజుల పాటు వర్తిస్తుందన్నారు. నిర్నిత రోజుల్లో రూ.1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్సను అందజేస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ అమలవుతున్న ఆసుపత్రుల్లో త్వరలోనే ఈ పథకం వర్తిస్తుందన్నారు. కావున జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments