అధికారపార్టీ నేతల ధనదాహం కు సహజవనరులు కనుమరుగు అవుతున్నాయి. పచ్చని చెట్లు ….పిల్ల కాల్వలతో ఆకర్షణ గా ఉండే మల్లారం గుట్టల ను అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు అడిగిన వారికి నయానో భయానో పడేస్తూ దందా సాగిస్తున్నారు.మీడియా ప్రతినిధులు సైతం నిస్సిగ్గుగా వసూళ్ల కోసం ఎగ బడుతున్నారు.
గుట్టలు అక్రమార్కుల దాడికి కనుమరుగవుతున్నా యి. నాణ్యమైన మొరం లభించటంతో గుట్టను అక్రమంగా తవ్విసొమ్ము చేసుకుంటున్నారు.సహజ సంపద కళ్ల ముందే కనుమరుగవుతోంది. అయిన స్వార్థపరుల చేతుల్లో పడి ఎక్కడ చూసినా కొండలు కరిగిపోతున్నాయి.
రాత్రింబవళ్లు తవ్వకాలు చేపడుతూ.. రెండు చేతులా అక్రమార్జన గావిస్తున్నా అడిగేవారు కరవయ్యారు. మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో పలు చోట్ల గ్రామం లో, గ్రామ పొలిమేరలో సహజసిద్దంగా ఏర్పడిన ఇలాంటి గు ట్టలు అనేకంఉన్నాయి.
దీంతో వాటిపైన అక్కమార్కుల కన్ను పడి కరిగిపోతున్నాయి. మారుమూల ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా జిల్లా కేంద్రానికి పది కిలో మీటర్ల దూరం లో ఉండే మల్లారం గ్రామానికి రెండు వైపుల ఉండే గుట్టలపై కొంత మంది అక్రమార్కులు కన్నేశారు. పొక్లెయిన్లతో తవ్వేస్తూ టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
గుట్టలను తవ్వే సమయంలో విలువైన చెట్లను సైతం తొలగిస్తున్నారు. ప్రభుత్వ గుట్టల వద్దే ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ, గనులు, అటవీ శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నది ఆరోపణలున్నాయి. సంబంధిత అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించటంతో బహిరంగానే తరలించుకుపో తున్నారు. మరోవైపు ప్రభుత్వ పనులపేరుతో రోడ్లకు, ఇతర బరంతీలకు అని తీసుకుపోయి అమ్ముకుంటున్నారు.
దీంతో వారికి కాసులవర్షం కురుస్తుంది. దీనికి పరోక్షంగా కొన్ని చోట్ల రాజకీయ నాయకుల అండఉండటంతో మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. గుట్టపక్కన పంటపొలాలు ఉండటం తో తవ్వగా ఏర్పడిన ఖాళీ స్థలాన్ని వారి భూమిలో కులుపుకుంటున్నారు. కొన్ని చోట్ల స్థానికులు అడ్డుకున్న సంఘటనలు ఉన్న అవి నామ మాత్రమే అవుతున్నాయి.
గత కొద్ది రోజులుగా గుట్టను తవ్వి వందల టిప్పర్లు మొరం అమ్ముకున్నారు. దాదాపు సగానికి పైగానే గుట్టస్వాహా అయ్యింది. జేసీబీ ఏర్పాటు చేసుకుని బాహాటంగానే తరలించుకుపోయారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు కొకొల్లలుగా జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శలున్నాయి.అయితే మొరం మాఫియా మీడియా ను సైతం ముడుపు లతో మేనేజ్ చేస్తున్నారు జిల్లా కేంద్రం నుంచి వెళ్లి ఒకరిద్దరు మెయిన్ మీడియా ను చూసుకుంటామని మొరం గుత్తేదారు తో బేరం కూడా చేసుకుంది మేము ఎవ్వరికి అనుమతి ఇవ్వలేము..
ఎమ్మార్వో అయిలాపూర్ గ్రామ శివారులో గుట్టను కొందరు ఇష్టం వచ్చినట్లు మొరం తవ్వకాలు చేస్తున్నారని అనే విషయం పై రూరల్ ఎమ్మార్వో ను వివరణ కోరగా మొరం తవ్వకాల కోసం మేము ఎవ్వరికి కూడా అనుమతి ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు.అక్కడ ఎవ్వరు మొరం తవ్వకాలు చేస్తున్నారో తెలియదని తెలిపారు. ఇప్పుడే మా అధికారులను పంపిస్తామని పేర్కొన్నారు.
