ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని పవన్ నగర్ కు చెందిన పాటి సంతోష్(40).
భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా డైరీ ఫాం వ్యాపారం ఉంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా మొత్తం ఎనిమిది పశువులు మృత్యువాత పడుతున్నాయి.
ఈ మేరకు తీవ్ర నష్టాంపోవడంతో మనస్థాపానికి గురై ఈనెల 12 న పురుగుల మందు సేవించాడు.గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నిజామాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుటుబికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.
