HomeDevotionalకొనసాగుతున్న సాగుతున్న నిమజ్జనాలు ..ఉమ్మెడ ఉదయం చేరుకున్న భారీ విగ్రహాలు

కొనసాగుతున్న సాగుతున్న నిమజ్జనాలు ..ఉమ్మెడ ఉదయం చేరుకున్న భారీ విగ్రహాలు

మంగళవారం రాత్రి మొదలైన గణేష్ విగ్రహాల నిమజ్జనం బుధవారం ఉదయం దాక సాగుతూనే ఉంది.గతంలో ఎన్నడూ లేని విధంగా రథ యాత్ర కూడా నెమ్మదిగా నే సాగింది.

మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన రథం వినాయక భావి కి చేరుకోవడానికి దాదాపు అర్ద రాత్రి 12 గంటలైంది. నగరంలో మిగితా గణపతులను నిమజ్జనం కోసం తరలించే విషయంలో జాప్యం చేసారు.

ఎనిమిది అడుగుల లోపు ఎత్తు ఉన్న విగ్రహాలను బాసర గోదావరి చెరువు కు తరలించారు.

భారీ విగ్రహాలను మాత్రం నందిపేట్ మండలం ఉమ్మెడ లో గోదావరి నదిసమీపంలో ఉమామహేశ్వరుని వద్దకు చేరుకున్న గణనాథుడు ఈ సంవత్సరం ఉమ్మెడ లోని ఉమామహేశ్వర ఆలయం వద్ద నిజామాబాద్ మహాగణపతులు నిమజ్జనం అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో భజన కీర్తనలతో డీజే సౌండ్ లతో కోలాహాలంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి

అధికారులు పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఎక్కడ అంతరాయం కలగకుండా మూడు క్రేన్ల ద్వారా నిమజ్జనం చేస్తున్నారు.భారీ విగ్రహాలను గోదావరి వద్ద భారీ క్రేన్ లను అందుబాటు లో పెట్టారు.

ఇక్కడ భారీ విగ్రహాలు సోమవారం అర్థ రాత్రే చేరుకుంటాయని భావించారు.కానీ మరుసటి రోజు ఉదయం అంటే బుధవారం ఉదయం 11 గంటల తరవాతే వచ్చాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments