ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందల్వాయి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం..
మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన వేల్పూరు సాయన్న (60). భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.ఆర్థిక ఇబ్బందులతో సోమవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్ కుమార్ పేర్కొన్నారు.
