ఢిల్లీ లిక్కర్ కేసులో లో అరెస్టయి జైలు లో ఉన్న ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ మంజూరు అయింది. 153 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి విడుదల కాబోతున్నారు.
దీనితో బిఆర్ యస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. అధిష్టానం సైతం ఊపిరి పీల్చుకుంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది .
కవిత పక్షాన ముకుల్ రోహిత్గి దర్యాప్తు సంస్థల తరుపున ఎస్వీ రాజు లు వాదనలు వినిపించారు .ఇదే కేసులో అరెస్టు అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కు ఇదే ధర్మాసనం బెయిల్ ఇచ్చింది..
ఆయన వర్తించిన నిబంధనలే కవిత కు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. కవిత కు బెయిల్ ఇస్తే దర్యాప్తు ను ప్రభావితం చేసే అవకాశం వుందని ఆమె విచారణకు సైతం సహకరించలేదని రాజు పేర్కొన్నారు.
ఫోన్ లలో ఉన్న డేటా ను కవిత ముందే ఫార్మేట్ చేసారని ఆధారాలు ధ్వంసం చేసిన కవిత బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం లో జస్టిస్ గవాయ్ పలు ప్రశ్నలు లేవనెత్తారు .
ఫోన్ లో మేసేజ్ లు డిలీట్ చేస్తే తప్పేముంది? కవిత కు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని అరుణ్ పిళ్లై స్టేట్ మెంట్ ఉపసంహరించుకుంటే కవిత కు సంబంధం వుంటుంది ? అంటూ ఈడీ న్యాయ వాదీ రాజు ప్రశ్నించారు.
మంగళవార బెయిల్ కచ్చితంగా వస్తుందని స్వయంగా కేటీఆర్ ప్రకటించారు నేపథ్యంలో కొందరు జిల్లా నేతలు రెండు రోజుల ముందే ఢిల్లీ వెళ్లారు లిక్కర్ స్కామ్‌లో ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు(ట్రయల్), ఢిల్లీ హైకోర్టు కొట్టేసాయి .
దీంతో ఈ కేసుల్లో మధ్యంతర బెయిల్ కోరుతూ ఈ నెల 7న ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
గతంలో రెండుసార్లు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీనితో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు , కవిత బెయిల్ పిటిషన్ మంగళవారం సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది కేటీఆర్, హరీశ్‌రావు సోమవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. .