ఐదవ టౌన్ ఎస్సై బదిలీపై వెళ్లడంతో, నూతన ఎస్సైగా గంగాధర్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు.
గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై వెంకట్రావు ఆరవ టౌన్ పీఎస్ కు బదిలీ కావడంతో, ఆర్మూర్ రూరల్ ఎస్సైగా విధులు నిర్వహిస్తూన్న గంగాధర్ ఐదవ టౌన్ ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టారు.
ఆయన మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేకంగా నిఘ ఉంచడం జరుగుతుందని, చోరీల నియంత్రణకు, జూదం, పేకాట,తదితరాల నియంత్రణపై ఉక్కుపాదం జరుగుతుందని తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణ కు కృషి చేస్తానన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించని కోరారు.