ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి వ్యక్తికి గాయాలు..ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే నగరంలోని కొజ్జా కాలానికి చెందిన షేక్ మునవార్ పనులు నిమిత్తం ధర్మబాద్ నుంచి నిజామాబాద్ వైపుగా వస్తున్న సమయంలో నిజామాబాద్ రెండవ ప్లాట్ ఫారం పై రైలు ఆగే క్రమంలో రైలు నుంచి కింద పడి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో అక్కడే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
