నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలోనీ మెడికల్ షాప్ లో చోరి జరిగింది.వివరాల్లోకి వెళ్లితే గురువారం రాత్రి నగరంలోని కలీల్ వాడి లోని ఎస్ ఎస్ ఎస్ జనరిక్ మెడికల్ షాప్ షెల్టర్ పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు షాప్ లోకి చొరబడ్డారు. షాప్ యజమాని శుక్రవారం ఉదయం వచ్చి చూసేసరికి షాప్ షెల్టర్ పగలగొట్టడంతో స్థానిక ఒకటవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఎంత నగదు అపహరించారనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
