నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మిస్సింగ్ అయిన రెండున్నరేళ్ల బాలుడు పక్కనే ఉన్న బస్టాండ్ లో లభ్యం అయ్యాడు.వివరాల్లోకి వెళ్లితే.. గౌతమ్ నగర్ కేశిరెడ్డి లత తన రెండున్నరేళ్ల బాలుడునీ తీసుకొని మంగళవారం ఉదయం చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది.
ఈ మేరకు బాలుడితో పాటు ఒకటవ అంతస్థులోని గైనకాలజి వార్డులో ఓపీ చూయించుకునే క్రమంలో బాలుడు మిస్సింగ్ అయినట్లు తెలిపారు. చుట్టూ పక్కల ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. స్థానిక ఎస్పీఎఫ్,ఒకటవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గాలించగా పక్కనే ఉన్న బస్టాండ్ వద్ద డ్యూటీ లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అరుణకి బాబు కనిపించడంతో పట్టుకొని ఒకటవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. బాలుడిని తల్లికి క్షేమంగా అప్పగించినట్లు సీఐ రఘుపతి పేర్కొన్నారు.
