: వర్ని రోడ్డులో గల ఆనంద్ నగర్ లో నిన్న సాయంత్రం నాలా లో పడి గల్లంతైన అనన్య అలియాస్ అను మృతదేహం ఈ రోజు ఉదయం లభించింది.
నిన్న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయింది. అప్పుడే భారీ వర్షం వల్ల చిన్నపాటి కాలువ నిండుగా ప్రవహిస్తోంది.
కొద్దిసేపటికి చిన్నారి కనిపించక పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే ఆడుకుంటూ నాలాలో పడిపోయిందని గుర్తించారు.
వెంటనే ఫైర్, మున్సిపల్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు.
తిరిగి ఈ ఉదయం మళ్లీ గాలించగా పీఎఫ్ కార్యాలయం సమీపంలోని దోబీఘాట్ వద్ద చిన్నారి అనన్య మృతదేహం లభించింది.
దీంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు…