HomeLaw and Orderఠాణాలకు ఆధునిక హంగులు .....కొత్త లుక్ లోకి మూడోటౌన్ స్టేషన్

ఠాణాలకు ఆధునిక హంగులు …..కొత్త లుక్ లోకి మూడోటౌన్ స్టేషన్

కంపుకొట్టే లాకప్ ….కుప్పలుగా ఫైళ్లు అపరిశుభ్రతఆనవాళ్లు….అడ్డదిడ్డంగా రికవరీ సామాగ్రి …..కనీసం కూర్చునే వసతి లేని దుస్థితి నుంచి పోలీస్ స్టేషన్ ను కాలక్రమేని ఆధునికత సంతరించుకుంటున్నాయి. హైటెక్ హంగులతో కార్పొరేట్ సంస్థలనే తలపిస్తున్నాయి.

కొత్తగా వస్తున్న అధికారులు స్టేషన్ లో వసతి ,సౌకర్యాలకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారు.స్టేషన్ కు వచ్చే అధికారుల టేస్ట్ తగ్గట్టుగా ఆయా ఠాణాలు సైతం కొత్త రూపం తెచ్చుకుంటున్నాయి. నిజామాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ఠాణా గా పేరున్న మూడో టౌన్ ఠాణా అదే కోవలోకి వచ్చింది.

రెండు నెలల క్రితం ఎస్సై గా వచ్చిన మహేష్ స్టేషన్ లో వసతి సౌకర్యాలే మొదటి కార్యాచరణ గా తీసుకున్నారు. స్టేషన్ సిబ్బంది ఉండే హల్ ను పార్టిషన్ ఛాంబర్ లు చేయించారు. రిసెప్షన్ కౌంటర్ ను అందుబాటులోకి తెచ్చారు.

స్టేషన్ ఆవరణలో చెత్తకుప్పల పేరుకు పోయిన రికవరీ సొత్తు తొలగించారు సిబ్బంది వాహనాలు క్రమపద్ధతి ఉండేలా పార్కిన్ షెడ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఉన్నపలంగా మరమ్మతులు చేయించారు. మొత్తంగా స్టేషన్ రూపు రేఖలు మార్చుకుంది. పచ్చదనం పరిశుభ్రత ఉట్టిపడుతుంది.

కేసు దర్యాప్తులో అనేక ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి తెచ్చుకున్న పోలీసులు తాము ఉండే స్టేషన్ లను బాగు చేసుకోవడంలో శ్రద్ద .ఆసక్తి వుండదు. కానీ సిబ్బంది ఉత్సహంగా…

ఉల్లాసంగా పనిచేయాలంటే వారుండే పరిసరాలు స్టేషన్ నిర్వహణ సైతం ప్రభావితం చేస్తాయి. అందుకే పచ్చదనం పరిశుభ్రత పేరుతొ గతంలో స్పెషల్ డ్రైవ్ లు చేపట్టి స్టేషన్ ఆవరణలో మొక్కలు పెంచారు.

ఆ తర్వాత ఆ కార్యాచరణ అటకెక్కింది. కొన్ని ఠాణాల్లో స్టేషన్ సిబ్బంది కూర్చోవడానికే వసతి వుండదు. బాధితులు గంటల తరబడిగా నిలబడే ఉండే పరిస్థితి. కానీ జిల్లాలో అనేక ఠాణాల్లో ఇప్పుడిప్పుడే మార్పులు కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments