నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని నందిపేట్ ప్రాంతానికి చెందిన గంగాధర్ డిఎస్పీ తన ఉద్యోగానికి రాజీనామా చేసి త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధం అవుతున్నారు.
నిజామాబాద్ గిరిరాజ్ డిగ్రీ కాలేజీ లో డిగ్రీ పూర్తీ చేసిన గంగాధర్ 1998 బ్యాచ్ ఎస్సై గా ఎంపిక అయ్యారు.ఎస్సై సీఐ లుగా సుదీర్ఘ కాలం నల్గొండ జిల్లాలో పనిచేసారు. డిఎస్పీ హోదా లో సైబరాబాద్ లో కీలక మైన విభాగాల్లో పనిచేసారు.
అలాగే కెసిఆర్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన సిట్ లో పనిచేసారు సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజి ,ఎమ్మెల్యే ల కొనుగోలు కేసు లాంటి కీలక కేసుల దర్యాప్తు లో గంగాధర్ పనిచేసారు.
నిజామాబాద్, అదిలాబాద్, కరీం నగర్, మెద క్. ఉమ్మడి జిల్లా ల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధం అవుతున్నారు
