HomePOLITICAL NEWSNationalప్రధాని గా మళ్ళీ మోడీ .....మరోసారి ఎన్డీయే కు పట్టం కట్టిన వోటర్లు ......ఎగ్జిట్ పోల్...

ప్రధాని గా మళ్ళీ మోడీ …..మరోసారి ఎన్డీయే కు పట్టం కట్టిన వోటర్లు ……ఎగ్జిట్ పోల్ అంచనాలలో తేల్చేసిన వైనం …….

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శనివారం తుది దఫా పోలింగ్ పక్రియ పూర్తీ అయింది . మొత్తం 7 దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగగా..

తుది దశ పోలింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఎన్నికలనియమావళి అనుసరించి శనివారం సాయంత్రం ఏడు గంటల నుంచి ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చేసాయి. మూడో సారి కూడా బీజేపీ నేతృత్వంలోని యన్ డి ఏ కూటమే అధికారంలో కి రాబోతుందని దాదాపు అన్ని ప్రైవేట్ సర్వే సంస్థలు, జాతీయ మీడియా ఛానెళ్లు తేల్చేశాయి.

ఓటర్లు ఎవరికీ పట్టం కట్టారో అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి బీజేపీ ఆశించిన స్థానాలు సాదించబోవడం లేదంటూ జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ ఉత్తవే నని దేశ ప్రజలు మరోసారి మోడీ ప్రధాని గా ఉండాలనే భావించారని ఎగ్జిట్ పోల్ అంచనాల్లో స్పష్టం అయింది.

కానీ బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న 400 స్థానాల మార్క్ ను మాత్రం దాటాక పోవచ్చని పేర్కొన్నాయి. 350 నుంచి 380 స్థానాలు వస్తాయనే ఎగ్జిట్ పోల్ అంచనాల్లో ఆయా సంస్థలు పేర్కొన్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments