బీజేపీ లోకసభ ఎన్నికల శంఖారావం జగిత్యాల్ వేదికగా మోగించబోతుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ప్రధాని మోడీ తెలంగాణలో మొదటి ఎన్నికల సభ ను నిర్వహిస్తున్నారు.రాత్రే హైదారాబాద్ కు వచ్చిన మోడీ కాసేపట్లో జగిత్యాల్ కు చేరుకోబోతున్నారు. విజయ సంకల్ప సభకు హాజరు కానున్నారు. జగిత్యాలలోని గీతా విద్యాలయ గ్రౌండ్‌లో ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11.15 గంటలకు జగిత్యాలకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సభలో మోడీ పాల్గొననున్నారు.
సభ అనంతరం హైదరాబాద్ చేరుకుని మోడీ ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మరోసారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అర్వింద్ మూడు రోజులుగా ఇక్కడే మకాం వేసి సభ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీఎత్తున ప్రజలను ఈ సభ కు తరలించేవిధంగా సన్నాహాలు చేసారు. నిజామాబాద్ లోకసభ పరిధి లోకి వచ్చే జగిత్యాల్ జిల్లా కేంద్రంలో జరిగే సభ నిర్మల్ కరీంనగర్ తో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి వేలాది మంది తరలివెళ్తున్నారు.
మోడీ సభ తర్వాత పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సహం ఉత్తేజం కలిగే అవకాశం ఉంది. అందుకే పార్టీశ్రేణులను పెద్దఎత్తున జగిత్యాల్ వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాంతంలో బీజేపీ ప్రాబల్యం అంతగా లేదు అందుకే మోడీ సభ తర్వాత ఈ ప్రాంతంలోనూ మోడీ మానియా మారుమోగేలా ఉండలనే ఎన్నికల సభ ఇక్కడే ఏర్పాటు చేసారు