HomeLaw and Orderరోడ్డుపై వాహనాలు నిలిపితే కఠిన చర్యలుదుకాణదారులకు సీపీ సాయి చైతన్య హెచ్చరిక

రోడ్డుపై వాహనాలు నిలిపితే కఠిన చర్యలుదుకాణదారులకు సీపీ సాయి చైతన్య హెచ్చరిక

జిల్లా కోర్టు సమీపంలో క్షేత్రస్థాయి పరిశీలననగరంలోని జిల్లా కోర్టు పరిసరాల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య స్పష్టం చేశారు.

కోర్టు ముందున్న దుకాణాలకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రోడ్డుపైనే అడ్డదిడ్డంగా నిలపడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్న నేపథ్యంలో గురువారం ఆయన అక్కడ తనిఖీలు చేపట్టారు.పరిశీలనలో భాగంగా రోడ్డుపై వాహనాలు పార్కింగ్‌ చేసి ఉండటాన్ని గమనించిన సీపీ.. స్థానిక దుకాణదారులను పిలిచి మాట్లాడారు.

ముఖ్యంగా ‘జె ఆరెంజ్‌ జిరాక్స్‌’ సెంటర్‌తో పాటు పలు ఇతర దుకాణాల యజమానులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ దుకాణాలకు వచ్చే కస్టమర్లు వాహనాలను రోడ్డుపై నిలపకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి రోడ్డుపై పార్కింగ్‌ చేయిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కోర్టుకు వచ్చే కక్షిదారులు, న్యాయవాదులు, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు సహకరించాలని సూచించారు.అనంతరం దుకాణాల వద్ద వినియోగదారులతో మాట్లాడి, పార్కింగ్‌ క్రమశిక్షణ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments