HomeLaw and Orderన్యాయ మూర్తి కోల్పోయిన సహనం.... న్యాయవాదుల ఆగ్రహం....

న్యాయ మూర్తి కోల్పోయిన సహనం…. న్యాయవాదుల ఆగ్రహం….

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ.రాజశేఖర్ రావు యువ న్యాయవాది పట్ల వ్యవహరించిన తీరును ఖండిస్తూ న్యాయవాదులు ఇరు రాష్ట్రాలలో ఆందోళనలు నిర్వహించారు. ఒక కేసు విషయమై గౌరవ న్యాయమూర్తి ముందు హాజరైన యువ న్యాయవాదిని 24 గంటల జుడిషియల్ కస్టడీకి తీసుకోవాలి అని ఆదేశాలు ఇవ్వడం కస్టడీలోకి తీసుకోవడంతో రెండు రాష్ట్రాల న్యాయవాదులు తీవ్రంగా పరిగణించారు.

ఈ సందర్భంగా ఈ రోజు యువ న్యాయవాది పై జరిగిన చర్యను ఖండిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులను బహిష్కరించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నీలకంఠరావు ఆధ్వర్యంలో సమావేశానికి హాజరైన న్యాయవాదులు జరిగిన సంఘటనను దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

బార్ మరియు బెంచ్ మధ్య ఉన్న సత్సంబంధాలు ఇటువంటి సంఘటనల వల్ల సన్నగిల్లుతుందని వాపోయారు ఈ మధ్య రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది న్యాయ అధికారుల తీరు న్యాయవాదుల పై వారు ప్రయోగిస్తున్న భాషా, వ్యవహార శైలి సరైన విధంగా లేవని అభిప్రాయపడ్డారు. మై లార్డ్,హానరబుల్ సార్, సార్ అని పిలుస్తూ వారిని కనిపించే దేవతలుగా న్యాయ అన్యాయాలు తేల్చి సమాజాన్ని చక్కదిద్దే గొప్ప వ్యక్తులుగా చూస్తుంటాం.

కానీ కొంతమంది గౌరవ న్యాయమూర్తులు సహనాన్ని, హుందాతనాన్ని కోల్పోయి వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని వాపోయారు. న్యాయవాదులు తమ వాదనలు వినిపించే సందర్భంలో కూడా వాదనలు వినడానికి కూడా ఓపిక లేకుండా, ఎలా వినిపించాలి ఎంత గొంతుతో వినిపించాలి హావభావాలు ఎలా ఉండాలి, అనే హద్దులను కూడా న్యాయమూర్తులు నిర్ణయిస్తున్నారు.

న్యాయవాదులు ఉన్నదే న్యాయం కోసం తమ వాదనాలను గౌరవప్రదంగా కోర్టుకు విన్నవించడానికి అటు వంటి సందర్భంలో ఒక్కో న్యాయవాది హావభావాలు ఒక్కోరకంగా ఉంటాయి వాదనలు వినాల్సిన సందర్భంలో ఇటువంటి చర్యలు తమ గొంతు నీ నొక్కేస్తున్నాయని వాపోయారు.

అలా చేయని పక్షంలో కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అని నిర్ణయిస్తున్నారు. ఎంతో సహనంతో ఉండాల్సిన అధికారులు మరికొన్ని సందర్భాలలో గౌర న్యాయస్థానాన్ని తమ కేసులో వాదనలు గౌరవంగా విన్నవించుకున్న, న్యాయవాది తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన మీరు మాకు దిశ నిర్దేశం చేస్తున్నారా అనే మాటలను న్యాయమూర్తుల నుండి వింటున్నాం అని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంఘటనలు దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి అని పలువురు న్యాయవాదులు సమావేశంలో చర్చించారు.

గౌరవ న్యాయ మూర్తుల పట్ల ఏ న్యాయవాది అయినా పూర్తి మర్యాదతో వ్యవహరించాలి అని అదే సందర్భంలో తమ వృత్తి గౌరవానికి భంగం కలిగితే సహించేది లేదని యువ న్యాయవాదికి పూర్తి మద్దతును తెలిపారు వృత్తిని నేర్చుకుంటూ క్రమంలో తప్పులు దొర్లడం సహజం అని వాటిని సరి చేస్తూ యువ న్యాయవాదులను ప్రోత్సహించాల్సిందిపోయి ఇటు వంటి చర్యలు తీసుకోవడం హేయం అయిన చర్య అని రాజ్యాంగ వ్యవస్థకు మూలం ” రూల్ ఆఫ్ లా” కోర్టులో గౌరవం, క్రమశిక్షణ పాటించాలి. అదే సమయంలో న్యాయ అధికారం వినియోగంలో న్యాయం ఉండాలి.

నేర్చుకుంటున్న యువ న్యాయవాదులతో వ్యవహరించేటప్పుడు సహనం సమతుల్య ప్రవర్తన ద్వారానే న్యాయవ్యవస్థ బలం తెలుస్తుంది.యువ న్యాయవాదుల పట్ల మరింత సహనంతో, కరుణతో వ్యవహరించాలని కోరారు.

న్యాయవాదులలో భయం, అవమానం లేదా బెదిరింపు కలిగించే ఏ చర్య అయినా న్యాయవాద వృత్తి స్వాతంత్ర్యాన్ని మరియు న్యాయ వ్యవస్థ యొక్క సరైన పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు.

బార్ ప్రెసిడెంట్ నీలకంఠ రావు,కార్యదర్శి సుభాష్ రెడ్డి గౌరవనీయ భారత సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జరిగిన సంఘటన పై విచారణ జరిపి అధికారి పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మరియు న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments