ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన జనకంపేట – నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయస్సు గల ఓ గుర్తుతెలియని వ్యక్తి గురువారం గుర్తుతెలియని రైలులో ప్రయాణిస్తున్నాడు.
ఉదయం 9:05 గంటల ప్రాంతంలో కిలోమీటర్ నంబరు 456/4-5 మధ్య కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో సదరు యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు పట్టడం సాధ్యపడలేదు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నిజామాబాద్ రైల్వే ఎస్‌ఐ ఫోన్ నంబరు 8712658591 కు సంప్రదించాలని పోలీసులు ఆయన కోరారు.
