HomePOLITICAL NEWSUncategorizedగిరిజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అల్లూరి

గిరిజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అల్లూరి

ఇందూరు: గిరిజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని కోట గల్లీలో గల విగ్రహానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన్యం వీరుడి త్యాగం చిరస్మరణీయమన్నారు. బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు.

సమాజంలో అణగారిన వర్గాల కొరకు జీవించిన మహా నాయకుడన్నారు. యువతలో దేశభక్తి ధైర్యం సేవా భావం పెంపొందించాల్సిన అవసరాన్ని అల్లూరి జీవితం నేర్పుతోందని స్పష్టం చేశారు.

  • అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆదేశాలతో నగరానికి చెందిన అడ్వకేట్ దేశపతి సుదర్శన్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
  • ప్రతి సంవత్సరం జయంతి తో పాటు వర్ధంతిని నిర్విరామంగా చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు చింతకాయల రాజేందర్, మఠం పవన్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, దేవా తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments