కిరాణా దుకాణానికి వెళ్లి రోడ్డు దాటే క్రమంలో కారు ఢీకొని చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన రూరల్ మండలంలో చోటుచేసుకుంది.
ఎస్హెచ్ఒ శ్రీనివాస్ తెలి పిన వివరాల ప్రకారం.. చక్రధర్నగర్ తండాకు చెందిన సాత్లోత్ పరమేశ్వర్ చిన్న కూతురు కీర్తన(6) బుధవారం ప్రధాన రహదారికి మరో వైపు ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతోంది.
ఈ క్రమంలో నగరంలోని డెంటల్ కళాశాలలో చదువుతున్న విశాఖపట్నానికి చెందిన జాన్సన్ ఆర్య అనే వ్యక్తి కారును అతివేగంగా నడుపుతూ వచ్చి చిన్నారిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయని తెలిపారు.
గమనించిన స్థానికులు కీర్తనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. తండ్రి పరమేశ్వర్ ఫిర్యాదు మేరకు నిందితుడిని గుర్తించి కారు సీజ్ చేశామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఒ శ్రీనివాస్ తెలిపారు.
