అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి గడ్డి మందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది కూతురు మరణం తట్టుకోలేక తండ్రి మార్గమద్య లో గుండె పోటు తో మృతి చెందాడు. నవిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. వీరన్న గుట్ట తండా కు చెందిన మాలావత్ జ్యోతి(34 ). అబ్బాపూర్ తండాకు చెందిన ప్రకాష్ అనే వ్యక్తితో 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
అయితే వీరికి ఇద్దరు ఆడపిల్లల సంతానం. భర్త, అత్తమామలు కలసి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని తాను ఇంకో వివాహం చేసుకుంటానని తరచూగా ఇబ్బంది పెట్టేవాడని,అందుకు మొదటి భార్య అయిన జ్యోతి అనుమతి తో అదే అబ్బాపూర్ గ్రామానికి చెందిన రాణినీ వివాహం చేసుకున్నాడు ఈమెకు ఒక కుమారుడు.వీరందరూ కలసిగా జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే ఈ నెల 22నాడు ఉదయం భర్త ప్రకాష్ ,మొదటి భార్య అయిన జ్యోతి తో గొడవ జరిగింది. అందుకు జ్యోతి సాయంత్రం సమయంలో గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిందదాని పేర్కొన్నారు.సదరు మహిళని హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే గురువారం రాత్రి చికిత్స పొందుతూ మృత్తి చెందింది.
అయితే గురువారం సాయంత్రం జ్యోతీ తండ్రి అయిన సోమ్ల తన కూతురు చావు బ్రతుకులో ఉందని సమాచారం అందడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్తున్నా సమయంలో ఒక్కసారిగా గుండె పోటు వచ్చి కుపోకూలి మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు.
విషమం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృత దేహాలను పరిశీలించారు.అనంతరం కుంటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి లో ఆందోళనకు దిగారు.మాకు న్యాయం కావాలంటూ ఆందోళన చేస్తున్నారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యాదగిరిగౌడ్ తెలిపారు
