పదేళ్లలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చేసిన అభివృద్ధి శూన్యమని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తీవ్రంగా విమర్శించారు. నిజామాబాద్‌లో మీ పదేళ్ల పాలనపై బహిరంగ చర్చకు రావాలని ఆయన మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.
శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొన్న మా శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణపై గణేష్ గుప్తా కొన్ని అవాస్తవ ఆరోపణలు చేసి తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారని అన్నారు. కేవలం జీవోలతో అభివృద్ధి జరగదని గణేష్ గుప్తా గుర్తించాలని హితావు పలికారు. ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ వచ్చిన తర్వాత నిజామాబాద్‌కు రూ.138 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. కావాలంటే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
మా నాయకుడు చేస్తున్న అభివృద్ధిని చూసి నేనే తెచ్చానని చెప్పుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. ఇకపై మా ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తే, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ కవిత ఎమ్మెల్యేల మీద ఆరోపణలు చేస్తుంది.
త్వరలోనే మాజీ ఎమ్మెల్యేల బాగోతం కూడా బయట పెట్టాలని అని కోరుతున్నాం అన్నారు.. మాటల రాజకీయాలు చేస్తున్నారు తప్ప, ప్రజలకు చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ప్రజాసమస్యలు, ఇప్పుడు రాజకీయ లాభం కోసం గుర్తుకు రావడం వికారం వ్యక్తం చేశారు. మాట్లాడే ముందు, తన పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనుల లిస్టు బయట పెట్టాలి.
కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడం సరికాదు. నిజాం ప్రజలకు తెలుసు అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, ఆ అభివృద్ధిని తట్టుకోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. పనుల్లో రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజమే, కానీ ప్రజల నమ్మకాన్ని మోసం చేయడం మాత్రం సరైంది కాదు. మాటలతో కాదు, పనులతోనే నాయకత్వం కొలుస్తారు దానికి ఉదాహరణే మా ఎమ్మెల్యే ధన్ పాల్ అని ఇది ప్రజలకు బాగా తెలుసన్నారు. నగరంలో ఎటువంటి సమస్య వచ్చిన ముందు నిలబడే వ్యక్తి సూర్యనారాయణ.
ఇంకోసారి అవస్థమైన ఆరోపణలు చేస్తే బుద్ది చేప్తాము అన్నారు. ఈ సమావేశం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకర్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, న్యాలం రాజు, అమందు విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
