HomeCRIMEజైళ్ల శాఖ లో చిచ్చు రేపిన మత్తు …..కీలక అధికారి తప్పించే యత్నాలు? ఇద్దరు అధికారుల...

జైళ్ల శాఖ లో చిచ్చు రేపిన మత్తు …..కీలక అధికారి తప్పించే యత్నాలు? ఇద్దరు అధికారుల మీద వేటు?

నిజామాబాద్ సెంట్రల్ జైలు లో మత్తు వ్యవహారం అధికారుల మధ్య చిచ్చు రేపింది. ఇద్దరు అధికారుల మీద చర్యలకు రంగం సిద్ధం అయింది. కానీ కీలక అధికారి ని తప్పించే యత్నాలు జరుగుతున్నాయనేది చర్చనీయాంశంఅయింది.

జైల్లో యథేఛ్ఛ సాగుతున్న అక్రమాల ఫై వరుస కథనాలు మీడియాల్లో రావడంతో ఉన్నతాధికారులు మొద్దు నిద్ర వదిలారు అధికారం హుటాహుటిన వచ్చిన వారు రోజంతా విచారణ చేశారు. విచారణ లో ఏ ఏ విషయాలు బయటికి వచ్చాయనేది గోప్యంగానే వుంచారు. ఇద్దరు అధికారులనే బాద్యులుగా గుర్తించి నట్లుగా ప్రచారం జరుగుతుంది.

కొంత ఖైదీలను జైలు అధికారులు చితక బాదిన ఘటన మీద న్యాయస్థానం కఠినంగా వ్యవహరించి సమగ్ర విచారణ కు ఆదేశించింది. నిజానికి జిల్లా జైలు నుంచి ‌ సెంట్రల్ జైలు గా మారిన తర్వాత అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కోర్టు కొరఢా ఝుళిపిస్తే కానీ ఉన్నతాధికారులు నిద్ర మత్తు వదలేదు.వసూళ్ల దందా ను ఇద్దరు అధికారులు గత కొంత కాలంగా సాగిస్తున్నారని బాహాటంగా ప్రచారం జరిగినా ఉన్నతాధికారులు లైట్ తీసుకుంటూ వస్తున్నారు .

నగరంలోని అర్సపల్లి ప్రాంతానికి చెందిన ఓ ఖైదీ తో పాటు మరో ఇద్దరు ఖైదీ లను జైలు ఆవరణ లో డ్యూటీ వేస్తూ వారి కేంద్రంగా నే అధికారులు అక్రమ దందా లకు తెరలేపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments