బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని మతాలకు చెందిన పెద్దలు సహకరించాలని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పోలీస్ కమిషనర్ (సీపీ) పి. సాయి చైతన్య కోరారు. బాల్య వివాహాలు సమాజానికి శాపమని, వాటిని అడ్డుకునేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
బాల్య వివాహాల విముక్తి లక్ష్యంగా శనివారం నిజామాబాద్ జిల్లా మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గంగాస్థాన్ ఫేస్-2 లో గల రామకృష్ణ మఠం యందు ” బాల్య వివాహాల విముక్తి గురించి అన్ని మతాలతో అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…:బాల్య వివాహాలను నిరోధించడం మత పెద్దల బాధ్యత అని గుర్తు చేశారు.
బాల్యవివాహాల విషయంలో పిల్లల తప్పుడు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డులు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని తెలియజేశారు. బాల్యవివాహాల చట్టం 2006 ప్రకారం శిక్షలు ఉంటాయని చెప్పారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని మత పెద్దలు గుర్తించాలని బాల్య వివాహాలకు సంబంధించి మత పెద్దల ద్వారా సమాజంలో మార్పు రావాలి అని తెలియజేశారు. వయసు నిర్ధారణ కచ్చి తంగా పాటించాలని సూచించారు.
ఈ బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ఎవరికైన సమాచారం వస్తే వారు తమ దగ్గరలోని పోలీస్ వారికి లేదా జిల్లా, శిశు వయోవృద్ధుల శాఖ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు తెలియజేయాలని అన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రచారం ద్వారా బాల్య వివాహాల వలన జరిగే నష్టాల గురించి క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమెన్ కమీషనర్ మెంబర్ సధామ్ అక్ష్మీ జిల్లా సంక్షేమ అధికారిని ఎస్.కె. రసూల్ బి, మైనార్టీ వెల్ఫేర్ జిల్లా అధికారి కృష్ణవేణి, డి.సి.పి.ఓ చైతన్య, ట్రయినర్స్ సునిత, స్వప్న, ఆదిత్య, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు జరిగాయి.
