యువత మత్తు పదార్థాలకు బానిసలై, భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దని, మాదక ద్రవ్యాల రహిత సమాజంగా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆటో నగర్ లోని డ్రైవర్స్ కాలనీలో మాదక ద్రవ్యాలు వినియోగ వల్ల కలిగే అనారోగ్య ప్రభావాలు, ఆర్థిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలు లాం టి చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశ నం చేసుకోవద్దన్నారు. ముఖ్యంగా 13 నుంచి 20 సంవత్సరాల వయసులోనీ యువకులే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల కదలికపై ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు.
ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవారే ఎక్కువగా గంజాయి లాంటి డ్రగ్స్ విక్రయిస్తున్నారని తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు నిద్ర పోరు.. ఒంటరిగా ఉండటం.. అందరిలో కలగకపోవడం.. ఫోన్ ఎక్కువగా వాడటం.. పెదవులు తడారడం లాంటివి లక్షణాలు ఉంటాయని సూచించారు.
యువకులు ఎన్ని సార్లు పట్టుకున్నా.. మారడం లేదు.. తల్లిదండ్రులు సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందన్నారు.ముఖ్యముగా నాందేడ్ పర్బనీ లాంటి ప్రాంతాలకు ట్రైన్ లలో వెల్లి గంజాయి తెచ్చి విక్రుస్తున్నారని పేర్కొన్నారు.
అందుకే విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష సాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటివి తీసుకుంటే ఆరోగ్యంపై పడే హానికర ప్రభావాలతోపాటు ఆర్థిక నష్టాలు, సమాజంలో గుర్తిం పు గౌరవం ఉండదని సూచించారు.
జిల్లాలో ఎకడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
