HomeTelanganaNizamabadఅల్లూరి సీతారామరాజు గారికి ఘనంగా నివాళి........

అల్లూరి సీతారామరాజు గారికి ఘనంగా నివాళి……..

అల్లూరి సీతారామరాజు గారి జయంతి ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో నగరం లోని కోటగల్లి లో గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళ్ళు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ గారు మాట్లాడుతూ మన్యం వీరుడు, పోరాట యోధుడు స్వతంత్ర సంగ్రామంలో గ్రామంలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన్నటువంటి వ్యక్తి,అనేక మందిని యుద్ధంలో నడిపించిన్నటువంటి వ్యక్తి.

గెరిల్లా పోరాట మార్గాన్ని ఎంచుకొని దెబ్బకు దెబ్బ అనే విధంగా ఆయుధాలను సమకూర్చి స్వతంత్ర పోరాటంలో విరోచితం గా పోరాడి అసలు బాసిన మహోన్నతమైన వ్యక్తి అల్లూరి అని తాను చివరిగా చనిపోయే ముందు వందేమాతరం అని నినదించి ప్రాణాలు విడిచిపెట్టిన పోరాటయోధుడని తెలిపారు వారి ఆశయాలను సాధించే దిశగా మనమందరం ముందుకు వెళ్లాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, పిల్లి శ్రీకాంత్, సుదర్శన్ రావు, అంజలి, రాజు, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments