గోవులను కాపాడడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి కోటిగిరి శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
మంగళవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందుత్వం , హిందూ రక్షణ, గోవుల రక్షణ కోసం బిజెపి పార్టీ పనిచేస్తుందని గొప్పలు చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న గోమాత రక్షణ ఏంది ఎందుకు ప్రత్యేక చట్టాలను తీసుకు రావడం లేదు అదే హిందువులకు బహిరంగ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు.
పదేళ్ల కాలంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన మోడీ గోవుల పట్ల ఎందుకు అశ్రద్ధగా వివరిస్తుందని ప్రశ్నించారు బిజెపి మోడీ నిరంకుశ వైఖరికి నిరసనగా తాను ఈ పార్లమెంట్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా కాపాడుకోవాలని ఏకైక నినాదంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఆయన తెలిపారు
