HomeCRIMEచికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి..

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి..

నగరంలోని సాయి నగర్‌ రోడ్‌-1 సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ( 55-60 ) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో సాయి నగర్‌ రోడ్‌-1 వద్ద సదరు వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఒక కారు ఆయనను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు, పోలీసులు కలిసి చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

పసుపు రంగు చొక్కా, నీలం (బ్లూ) రంగు లుంగీ ధరించి ఉన్నారు.మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదు. పైన పేర్కొన్న ఆనవాళ్లు కలిగిన వ్యక్తి గురించి సమాచారం తెలిసిన వారు 8712659844, 8712659727 ఫోన్‌ నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments