లోకసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజే పదవుల పందేరానికి తెరలేపింది. సీనియర్ నేతలకు కీలక పదవులు కట్టబెట్టింది. ఉమ్మడి జిల్లాకు ఏకంగా నాలుగు కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులు కేటాయించింది. అదికూడా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన వారికే ఈ పదవులు కట్టబెట్టారు.ఇద్దరు బీసీ లకు ఇద్దరు రెడ్డి సామాజికవర్గం కు కేటాయించారు.
అయితే ఒక్క బాల్కొండ నియోజకవర్గం నుంచే ముగ్గురికి కీలక పదవులు దక్కడం గమనార్హం.అసెంబ్లీ ఎన్నికల్లో బాన్స్ వాడ టికెట్ రాక పోవడంతో మనస్తాపానికి గురై ఆత్మ హత్య యత్నం చేసిన బాలరాజు కు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ అప్పగించారు.నిజామాబాద్ జిల్లా పరిధి లోని బాల్కొండ కు చెందిన మాజీ ఎమ్మెల్యే అనిల్ ఇరవత్రి ఖనిజాభివృది సంస్థ ను కేటాయించారు.
బీసీ పద్మశాలి సామాజికవర్గం కు చెందిన ఆయన మొదటి నుంచి రేవంత్ సన్నహితుడిగా ఉన్నారు అయినప్పటికీ అసెంబ్లీ టికెట్ దక్కలేదు. కానీ కామారెడ్డి లో రేవంత్ రెడ్డి పక్షనా ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బరిలోకి దిగడానికి ఆసక్తి చూపెట్టారు.
ఈ మేరకు టికెట్ కోసం దరకాస్తు చేసుకున్నారు. డీసీసీ నుంచి వెళ్లిన ఆశావాహుల జాబితాలోనూ అనిల్ పేరుంది. కానీ అనూహ్యంగా ఆయన కు కార్పొరేషన్ పదవీ కట్టబెట్టడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. కానీ ఈ పదవీ ఎంపీ టికెట్ కు అడ్డం కాదనే ధీమాతో అనిల్ ఉన్నారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి సామజిక కోణం టికెట్ ఇవ్వలేని పక్షంలో అనిల్ పేరే ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కి సైతం సహకార సంస్థల కార్పొరేషన్ బాధ్యతలు ఇచ్చారు. ఆయన కూడా బాల్కొండ టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టారు .
కానీ రేవంత్ సముదాయించడంతో వెనక్కి తగ్గారు.అలాగే పార్టీ అధికారంలో లేక పోయిన రైతు ఉద్యమాల కదం తొక్కిన కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మెన్ గా నియామకం అయ్యారు. పదేళ్ల కాలం తర్వాత కాంగ్రెస్ నేతలకు పదవుల పంట పండుతుంది.