బైక్ పై నుండి పడిన ఘటనలో ఒకరు మృతి చెందాడు రెంజల్ ధర్మాబాద్ పిప్పల్గావ్ గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రేంజల్ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన సాహెబ్రావ్ వయసు 35 రోజు కూలి, కుమారుడికి ఆరోగ్యం బాలేదని అత్తగారింటికి మహారాష్ట్ర వెళుతుండగా పిప్పల్గావ్ పాట రోడ్డు డివైడర్ పనులు జరుగుతుండడంతో అనుకోకుండా డివైడర్ పైకి ఎక్కించడంతో అదుపుతప్పి బైక్ పై నుండి కింద పడగా తలకు గాయం తగిలి ఉమ్మరిలోని హాస్పిటల్ కి తరలించగా పరిస్థితి విషమించడం తో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సిఫారసు చేశారు.
ఉమ్రి నుండి నిజామాబాద్ హాస్పిటల్ కి వెళ్తుండగా మార్గమధ్యంలో మరణించాడు
